14 August, 2026 | 1:30 AM

27 ఏళ్ల వ్యక్తికి సంక్లిష్ట క్యాన్సర్ సర్జరీ

14-08-2026 12:00 AM

మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహణ  

హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): అనకాపల్లి జిల్లాలోని సుదూర గిరిజన గ్రామమైన కోనంకి చెందిన 27 ఏళ్ల యువకుడికి అధునాతన క్యాన్సర్ వైద్యం పొందడం కేవలం మైళ్ల దూరం ప్రయాణించడం మాత్రమే కాదు. అది ఆశ, ధైర్యం, జీవించే పోరాటంతో కూడుకున్న ప్రయా ణం. వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండే కొండ ప్రాం తపు గిరిజన గ్రామంలో నివసిస్తున్న ఆ బాధితుడు, అతని కుటుం బం, తీవ్రమైన క్యాన్సర్ వ్యాధికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

‘మీడియాస్టినల్ జెర్మ్ సెల్ ట్యూమర్’తో బాధప డుతున్న ఆ బాధితుడికి, మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి మల్టీడిసిప్లినరీ క్యా న్సర్ కేర్ అందించారు. ఇదివరకే కీమోథెరపీ పూర్తి చేసుకున్న ఆ బాధితుడికి, తదుపరి నిర్వహించిన పీఈటీసీటీ స్కాన్‌లో ట్యూమ ర్ పరిమాణం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉన్న మిగిలిన ట్యూమర్ భాగాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు.

పూర్తి క్లినికల్ మూల్యాంకనం తర్వాత, సర్జికల్ ఆంకాలజీ బృందం ‘స్టెర్నోటమీ విత్ ఎక్సిషన్ ఆఫ్ మీడియాస్టినల్ ట్యూమర్’ శస్త్రచికి త్సను ప్లాన్ చేసింది. ముఖ్యమైన అవ యవాలు, ప్రధాన రక్తనాళాల వద్ద ట్యూమర్ ఉండటంతో ఇది ఎంతో సంక్లిష్టమైన శస్త్రచికిత్స సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, లాపరోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ హరీష్ దారా, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహేష్ బెజగం గా రు హాస్పిటల్ మల్టీడిసిప్లినరీ మెడికల్, సర్జికల్ బృందం సహకారంతో 29 జూలై 2026న  సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

శస్త్రచికిత్స అనంతరం సమగ్ర సంరక్షణ అందించడంతో బాధితుడు వేగంగా కోలుకుని, 3 ఆగస్టు 2026 న స్థిరమైన ఆరో గ్య పరిస్థితితో డిశ్చార్జ్ అయ్యారు. ఈ విజయవంతమైన చికిత్స బాధితుడికి, అతని కుటుంబానికి ఎంతో ఉపశమనాన్ని అందించింది.

ఈ కేసు గురించి డాక్టర్ హరీష్ దారా, డాక్టర్ మహేష్ బెజగం మాట్లాడుతూ  ‘క్యాన్సర్ అనేది ప్రతి కుటుంబానికి పెద్ద సవాలు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు నిపుణులైన వైద్యులను కలవడానికే ఎన్నో ఇబ్బందు లు పడుతుంటారు. ఈ పేషెంట్ కీమోథెరపీకి బాగా స్పందించడంతో, మేము సురక్షి తంగా శస్త్రచికిత్స చేసి మిగిలిన ట్యూమర్ను తొలగించగలిగాము. సరైన సమయంలో మెరుగైన చికిత్స అందాలనేదే మా ధ్యేయం. అత్యాధునిక వైద్యంతో పాటు బాధితులకు కోలుకుంటామనే నమ్మకాన్ని అందించడమే మా ముఖ్య ఉద్దేశం‘ అని తెలిపారు.