ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ మహేష్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): దేశభక్తి, ఐక్యతను పెంపొందించేలా ప్రధా న మంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నల జెండాను ఆవిష్కరించాలని బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం భోలక్ పూర్ డివిజన్లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి హర్ ఘ ర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి మహేష్ కు మార్ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ భోలక్ పూర్ హౌస్ వరకు కొనసాగింది. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ దే శ భక్తి పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరా రు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ని ర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యానంద్, అజయ్ నాయుడు, రాజశేఖర్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.






