16-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వతంత్ర భారతదేశంలో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ర్ట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన మరింత సులభమైందని ప్రజాపాలన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా అభివృద్ధిలో జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు సమిష్టిగా కృషి చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా పదో తరగతి ఇంటర్‌లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పదివేల చొప్పున నగదు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల రిటైర్డ్ ఆర్టికల్చర్ రాష్ర్ట కమిషనర్ వెంకట్రాంరెడ్డి అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ అజ్మీర సాంకేతి కుమార్ ఏఎస్పీలు అవినాష్ కుమార్ రాకేష్ మీనా డిఆర్‌ఓ రత్న కళ్యాణి జిల్లా అధికారులు పాల్గొన్నారు