calender_icon.png 17 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం

16-08-2025 12:00:00 AM

-మహిళలను కోటీశ్వరులను  చేయడం ప్రభుత్వ లక్ష్యం 

-మహాలక్ష్మి పథకంతో తెలంగాణకు  ప్రపంచంలోనే గుర్తింపు

-కాంగ్రెస్ ప్రజా పాలనలో 1.13 లక్షల కోట్లు రైతుల కోసం వ్యయం 

-కామారెడ్డిలో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి

-కన్నుల పండుగగా  స్వాతంత్య్ర దినోత్సవం 

 కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమీషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మహాలక్ష్మి పథకం తో తెలంగాణకు ప్రపంచంలోనే గుర్తింపు లభించిందన్నారు. అత్యంత ప్రజాదారణ పొందిన మహాలక్ష్మి పథకంగా గుర్తింపు పొందిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రజాపాలనలో 1.12 లక్షల కోట్ల రూపాయలు రైతన్నల కోసం ఖర్చు చేశామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్  చైర్మన్ ఎం కోదండ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలు శాఖల శకటాలను ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల నృత్యాలు ఎంతో అలరించాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. 79వ పంద్రాగస్టు వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. దేశ, రాష్ట్ర ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

సిఐ ఇ ఆర్  అప్లికేషన్ ద్వారా 2427 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను  రికవరీ చేసి నాలుగు కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరణాల తగ్గుదలకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక  కార్యాచరణను కోదండ రెడ్డి అభినందించారు. ఏడు నెలల కాలంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 44 రోడ్డు ప్రమాద మరణాలను అరికట్టారన్నారు. రైతుల, మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల తో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ ఆమోదం చేసిందన్నారు.

సన్న బియ్యం  పంపిణీలో 13 వేల కోట్ల ఖర్చుతో 3 వేలతో మందికి ఆహార భద్రత కల్పించామన్నారు. ఆత్మగౌరానికి ప్రతీకగా 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసామన్నారు. 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల రైతులకు రైతు రుణమాఫీ చేపట్టి దేశంలో కొత్త చరిత్ర కాంగ్రెస్ రచించింది అన్నారు. రైతు భరోసా కు 9 వేల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సన్న బియ్యం కు 500 రూపాయల బోనస్ చెల్లించామన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో 1.13 లక్షల కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు చేశామన్నారు. 22 వేల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్లతో బిల్లును అసెంబ్లీ ఆమోదించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రపంచంలో పేరుగాంచిన స్కీముగా ప్రజల్లో గుర్తింపు పొందిందన్నారు. మహత్తరంగా తెలంగాణ రైజింగ్ _2047 తెలంగాణను ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెడుతుందన్నారు. గత యాసంగిలో జిల్లాలో 887 కోట్ల రూపాయలు 73 వేల మంది రైతుల ఖాతాలో వడ్ల డబ్బులు జమ చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద 169 కోట్ల రూపాయలతో 154 యూనిట్ల ద్వారా వివిధ వ్యాపార సంస్థలను మహిళల కోసం నెలకొల్పామన్నారు. 

818 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ,స్త్రీ నిధి కింద మహిళా సంఘాలకు రుణాలు అందించమన్నారు. ప్రతినెల 1.62 లక్షల మందికి  చేయూత  పింఛన్ల కోసం 36 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో మూసివేసిన ఐదు ప్రభుత్వ బడులను తిరిగి ప్రారంభించామన్నారు. వన మహోత్సవం కింద జిల్లాలో 24 లక్షల మొక్కలు నాటమన్నారు. భూభారతిలో జిల్లా రైతుల నుండి 36వేల దరఖాస్తులు స్వీకరించి ఆమోదయోగ్యమైన 977 కేసులను పరిష్కరించామన్నారు. మిగతా భూభారతి దరఖాస్తులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామనీ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి స్పష్టం చేశారు. బిచ్కుందను కొత్త మున్సిపల్ గా ప్రభుత్వం గుర్తించిందని, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో 100 రోజుల ప్రత్యేక  కార్యచరణ చేపట్టి సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నామన్నారు.

అమృత్ పథకంలో మూడు మున్సిపల్ లో 180 కోట్ల రూపాయలతో నీటి సరఫరా  అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అన్నారు. 7 నెలల కాలంలో రోడ్డు ప్రమాదాలు నివారణ యాక్షన్ పోలీస్ శాఖ చేపట్టిందని 44 మరణాలను తగ్గించారని కోదండ రెడ్డి  ప్రశంసించారు. కామారెడ్డి జిల్లాలో నేర రహిత  సమాజంగా మార్చడానికిy మనందరం సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పీ రాజేష్ చంద్ర,అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, జిల్లా గ్రంథాలయ సమస్త చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఏఎస్పి చైతన్య రెడ్డి, డిఎఫ్‌ఓ నికిత , ఆర్డిఓ వీణ, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్..ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. 

నిజామాబాద్, ఆగస్టు 15 :(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.  ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఛైర్మన్, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, మత్స్య శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను, వివిధ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు. స్వాతంత్య్ర సమర యోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద  మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.

కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట్ బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని స్నేహా సొసైటీ రూరల్ రికన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన దివ్యాంగులైన చిన్నారులు దేశభక్తి గేయాలపై ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పంద్రాగస్టు వేడుక శోభను మరింతగా పెంపొందింపజేసింది. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో..

నిజామాబాద్ ఆగస్ట్ 15:(విజయ క్రాంతి); 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా పోలీసు  .పి క్యాంప్ కార్యాలయం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు, సిబ్బంది  పథకావిష్కరణ మహోత్సవానికి హాజరయ్యారు. డి.ఐ.జి క్యాంప్ కార్యాలయంలో  సి పి పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జ. బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లో అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శ్రీ కె. రామచందర్ రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

వాడవాడల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి), 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పీ కార్యాలయంలో ఎస్పి రాజేష్ చంద్ర, కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఏఎస్పి చైతన్య రెడ్డి, పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్‌ఓ నరహరి, దేవునిపల్లి సర్కిల్ కార్యాలయం ఎదుట సిఐ రామన్, ఆర్డీవో కార్యాలయం ఎదుట వీణ, జిల్లా కోర్టు భవనం ఎదుట జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్,ఆర్టీసీ బస్టాండ్ ఎదుట డిపో మేనేజర్ కరుణశ్రీ, జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట కలెక్టర్ ఆశిష్ సంగువన్, తాసిల్దార్ కార్యాలయం ఎదుట తా హసిల్దార్ జనార్ధన్, క్రీడా కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసా గౌడ్ జెండా ఎగరేశారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, టిఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పలు కాలనీలో జెండా ఆవిష్కరించారు. బిజెపి జిల్లా కార్యాలయం ఎదుట బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంఘాలు ఆయా సంఘాల ఎదుట జెండాలో  ఎగరవేశారు.

భారత స్వాతంత్య ఫలాలు ప్రజల పరమైన వసంతాలు ఃజిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ 

నిజామాబాద్ లీగల్ కరస్పాండెంట్ ఆగస్టు 15 (విజయ క్రాంతి): భారత ప్రజల విరోచిత పోరాటం బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొంది డ్భె ఎనిమిది వసంతాలు గడిచిపోయి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటు భారతవని బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో 79 వ భారత స్వాతంత్య దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.జిల్లా ప్రజలకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తు బాధ్యతల బరువును మోయాలని పేర్కొన్నారు. శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ప్రజల ప్రగతికి ఇతోదిక సహాయకారాలుగా ఉన్నాయని అన్నారు.

ప్రజల హక్కులు, స్వేచ్ఛ లకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా ఉన్న చారిత్రత్మాక తీరులను గుర్తు చేశారు. భారతదేశం మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో, నేరరహిత సమాజం కోసం, చట్టాల ద్వారా సమకూరె ప్రయోజనాలు ప్రజల దరికి చేరే విదంగా ప్రజా సమూహలుగా మనవంతు పాత్రను నిర్వాహంచాలని జిల్లాజడ్జి ఆశించారు. గ్రామాలలో అసమానతలు లేని, ఆధిపత్యం లేని సమానత కోసం, అందరు కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలానే న్యాయసేవ సంస్థ ఆశయానికి తోడ్పాటును అందించాలని ఆమె జిల్లా ప్రజలను కోరారు. జెండా వందన కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జీలు ఆశాలత, హరీష, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరి కుమార్, ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు మామిళ్ళ సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

క్యాంప్ ఆఫీస్, జెడ్పీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ 

నిజామాబాద్, ఆగస్టు 15 :(విజయ క్రాంతి):  79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్ తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బీసీ కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికిన కలెక్టర్ 

నిజామాబాద్, ఆగస్టు 14 :(విజయక్రాంతి ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్. నిరంజన్ గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద ఆయనను  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. చైర్మన్ కు స్వాగతం పలికిన వారిలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాల్సిందే...బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి 

నిజామాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి) : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద జాతీయ జెండాను నిజామాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఎగురేశారు ఈ సందర్బంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ  గత రెండు నెలల క్రితం నూతన కలెక్టరేట్ కార్యాలయం పక్కన కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఆ సమయంలో, ఆ ఇళ్లు అన్యాక్రాంతం అవుతూ, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని గుర్తించారు. వెంటనే ఆ ఇళ్లు పేదలకు అందించాలని, ఆగస్టు 14 వరకు గడువు ఇస్తున్నామని ప్రకటించారు. ఆగస్టు 15న నిరుపేదలతో కలసి గృహ ప్రవేశం చేస్తామని హెచ్చరించారు.

కానీ, రాజకీయ నాయకుల మాటల్లా ఇది కూడా మాటలకే పరిమితమవుతుందని అనుకున్నప్పటికీ, ఆగస్టు 13న మళ్లీ కలెక్టర్ గారికి లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. దీనికి స్పందించిన కలెక్టర్, అదే రోజు మధ్యాహ్నం జిల్లా అధికారులను అక్కడికి పంపి తక్షణ చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల విజ్ఞప్తిని గౌరవిస్తూ, గృహప్రవేశం వాయిదా వేసి సహకరించామని దినేష్ పటేల్ తెలిపారు.బీజేపీ శ్రేణులను ఉద్దేశించి, ఆగస్టు 18 నుంచి జిల్లాలో ఎక్కడైతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయో, వాటిని పరిశీలించి పేదల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘చట్టాన్ని ఎప్పుడూ చేతుల్లోకి తీసుకోకుండా, శాంతియుతంగా జాతీయ జెండా ఎగురవేశాం. కానీ, ఖాళీగా ఉన్న ఇళ్లను పేదలకు ఇవ్వాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం‘ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జగన్ రెడ్డి, ముస్కె సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, అన్వేష్, లక్ష్మణ్, ప్రజలు పాల్గొన్నారు

న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం... 

నిజామాబాద్ ఆగస్టు 15: (విజయ క్రాంతి): 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ అద్వయ్యంలో  నగరం లోని సరస్వతి నగర్ లో గల కార్యాలయం వద్ద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ  చేసిన అనంతరం మాట్లాడుతూ  ఎందరో మానీయుల ఉద్యమ త్యాగ ఫలితం గా సాధించిన  స్వతంత్రని నేడు స్వచ జీవనాన్ని  గడుపుతున్నామని  దేశ సార్వభౌమత్వానికి సవాలు గా మారిన పాక్  ప్రేరేపిత  తీవ్ర  వాదాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సమర్థవంతంగా  తిప్పి కొట్టిందని సైన్యం ధైర్య సాహసం అభినందనీయం నేటి యువత దేశ భక్తుతో దేశ  అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు కార్యక్రమం లో  పరిషత్ న్యాయవాదులు బండారి కృష్ణానంద్  కార్తన్ గణేశ్ పదేగేల వెంకటేశ్వర్ సుదర్శన్ రెడ్డి విగ్నేష్  వెంకట రామనగౌడ్  రవి జేపీ లోహియా సురేశ్ తోట శ్రీనివాస్ సింగం అంజలి తదితరులు పాల్గొన్నారు