calender_icon.png 17 August, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్తూరు పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

16-08-2025 12:00:00 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 15 : జిన్నారం మండలం నల్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం హెటిరో పరిశ్రమ ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేసింది. గంటకు రెండు వందల యాబై లీటర్ల ఆర్వో నీటిని సిద్దం చేసే రూ.లక్ష విలువైన మిషనరీని  పరిశ్రమ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆర్వో వాటర్ ప్లాంటును హెటిరో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవిబాబు గ్రామ తాజా మాజీ సర్పంచ్ జనార్దన్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా హెటిరో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవిబాబు మాట్లాడుతూ విద్యార్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవకాశాలను సద్విని యోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు.  సీఎస్‌ఆర్ రిప్రెజెంటేటీవ్ రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషు, అబ్దుల్లా, ఉపాధ్యాయులు, స్థానికులుపాల్గొన్నారు.