calender_icon.png 1 November, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరి

01-11-2025 12:34:04 AM

మునిపల్లి, అక్టోబర్ 31 :ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మునిపల్లి మండలం కంకల్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు విధానాన్ని పరిశీలించి మనబడి కార్యక్రమంలో నిర్మించిన మధ్యాహ్న భోజన పథకం, షెడ్డును పరిశీలించారు. పాఠశాల వాతావరణం బాగుందని ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.

నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజన అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అలాగే పదవ తరగతి విద్యార్థుల హాజరు శాతం పెంచి, శత శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పోరేషన్ ఈడీ, మండల ప్రత్యేక అధికారి రామాచారి, కంకోల్ జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం తుకారాం, ఉపాధ్యాయులు ఉన్నారు.