01-11-2025 12:33:01 AM
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పార్టీ అధిష్ఠానం మూడు నెలల ముందుగానే నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మహ్మద్ అజారుద్దీన్‌పై కేసులు ఉన్నాయని, దేశ ద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశ ద్రోహులు ఎవరో, దేశానికి సేవ చేసిన వారు ఎవరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలియకపోవడం బాధాకరమన్నారు. ఓ మైనారిటీ నేతను మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఎందుకు అంత అక్కసు.. అంటూ ఫైర్ అయ్యారు.