09-08-2025 12:00:00 AM
సంతాప సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
మణుగూరు,ఆగస్టు 7(విజయ క్రాంతి) : ప్రజల పక్షాన పోరాటాలకు బాసటగా నిలిచి, ఐదు దశబ్దలకు పైగా సిపిఐ పార్టీ నిర్మాణంతో పాటు పలు ఉద్యమలలో పేదలకు అండగా నిలబడి, ప్రజాసమస్యలపై పోరాడిన, పార్టీ రాష్ట్రవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్యచారి అకాల మరణంతో పార్టీ ఓ నిబద్ధత గల నాయకుడిని కోల్పోయిందని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్య వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
తొలుత వారు అయోధ్య పార్ధ్వదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ బాడిస సతీష్ అధ్యక్షతన జరిగిన అయోధ్య సంతాప సభలో పాల్గొని మాట్లా డారు. యువకుడిగా ఉన్నప్పుడే వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అయోధ్య పేదల కోసం అనేక పోరాటాలు చేశారని, నిర్బంధాలను ఎదుర్కొన రని, అదే ప్రజల పక్షాన నిలబడ్డారని కొనియాడారు.
ఈ ప్రాంతంలో సిపిఐ పార్టీని అగ్ర భాగాననిలిపి ఎర్ర జెండా కే వన్నె తెచ్చారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్ట పడుతూ తుదిశ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీ లో కొనసాగిన అయోధ్య మరణం భారతకమ్యూనిస్టు పార్టీకి, ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. కార్మిక, రైతు సమస్యలపై , పేదలకు భూపంపిణీ కోసం భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు.
ప్రజా ఉద్యమాల్లో ప్రజల కు చైతన్య నింపి ముందుకు నడిపించారన్నారు. మణుగూరు ప్రాంతం అభివృద్ధిలో ప్రజా పోరాటాల్లో ఆయన కృషి ఎనలేని దన్నారు. అయోధ్య చరిత్ర అజరా మమని, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపో తారన్నారు. ఆయన బాటలో పయనించడం మన ముందున్న కర్తవ్య మన్నారు.
అయోధ్య కలలు కన్నా ఆశయాల వెలుగు లో ప్రజలు, పార్టీ శ్రేణులు నడవాలని, పేద ప్రజలకు ఎప్పుడు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. ఈ సంతాప సభలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతా రామయ్య , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, నవీన్, వాసిరెడ్డి చలపతిరావు, కె.వి. రావు,పోలెబోయిన శ్రీవాణి, సరెడ్డి పుల్లారెడ్డి ,
మున్న లక్ష్మీ కుమారి, జక్కుల రాజబాబు, దుర్గ్యాల సుధాకర్,కుర్రి నాగేశ్వర రావు,సింగరేణి జిఎం రామ్ చందర్, కూచిపూడి బాబు, సాయిని వెంకటేశ్వరరావు, నెల్లూరు నాగేశ్వరరావు, ప్రైవేట్ స్కూల్స్,గోల్ షాప్, కిరాణా షాప్ అసోసియేషన్ ఆటో కార్మికులు, సిపిఐ శ్రేణులు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళు లర్పించారు.