08-08-2025 12:24:41 AM
-బీసీలకు బాసటగా ఉంటాం
-దామాషా ప్రకారం రిజర్వేషన్ దక్కే వరకు పోరు కొనసాగుతుంది
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
-గోవాలో ఘనంగా పదో ఓబీసీ జాతీయ మహాసభ
-మహారాష్ట్ర, గోవా సీఎంలు పడ్నవీస్, ప్రమోద్ సావంత్ హాజరు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): బీసీలు కోరుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదిని కులగణనతో మొదలుపెట్టనున్నదని, కులగణన తర్వాత దేశంలో బీసీలకు నవశకం వచ్చే అవకాశముందని తాము విశ్వసిస్తున్నట్టు మహారాష్ర్ట సీఎం దేవేంద్ర పడ్నవీ స్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. గురువారం గోవా రాష్ర్టంలో 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించారు. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృ త్వం వహించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, గల్లీ నుండి ఢిల్లీ దాకా బీసీలు పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం స్పం దించి జనగణనతో పాటే కులగణనను చేస్తామని ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కులగణన ప్రకటన వంద శాతం బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ రంగాలలో రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కేవరకు జాతీయ స్థాయిలో బీసీల పోరును కొనసాగిస్తామని వెల్లడించారు.
దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. సీఎంలు పడ్నవీస్, ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ... ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీలకు మేలు చేయాలని ఉద్దేశంతో కేంద్ర మంత్రిత్వ శాఖలో 27 మందికి బీసీలకు అవకాశం కల్పించారని, సామాజిక న్యాయ కోణంలో దేశంలో రాష్ర్టపతులుగా బలహీన వర్గాలకు అవకాశం కల్పించారని తెలిపారు.
దేశవ్యాప్తంగా బీసీ కు లాల లెక్కలు తీసి జనాభా ఆధారంగా బీసీలకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎవరి వాటా వారికి దక్కాలన్నది కాంగ్రెస్ పార్టీ సి ద్ధాంతమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు ఠాగూర్ పేర్కొన్నారు. కార్యక్రమం లో ఓబీసీ నాయకులు మధు నాయక్, సచిన్ రాజోల్కర్, తాటికొండ విక్రమ్ గౌడ్, సుభాష్ శిరోవర్కర్, మహాదేవ్ జన్కర్, పరిన్ పూకే, కేసన శంకర్రావు, బైరు రవి కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, ఇంద్రజిత్ సింగ్, శ్రీపతి చాహ, రత్నమా ల, కమలేష్ గుప్తా, కనకాల శ్యాం కుర్మా, కుందారం గణేష్ చారి, చిన్న శ్రీశైలం యాదవ్, బీ.మనీ మంజరి, ఎం చంద్రశేఖర్ గౌడ్, మహే ష్ యాదవ్, నరేష్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.