03-12-2025 12:00:00 AM
బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో చెయ్యి కొల్పోయిన బాధితుడు
ఎల్బీనగర్, డిసెంబర్ 2 : ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన రోడ్డు ప్రమాదంలో చెయ్యి కొల్పోయిన బాధితుడికి పరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం హయత్ నగర్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... గత 27వ తేదీన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌస్ వద్ద సర్వీస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో ఘటన చోటు చేసుకుంది..
ఈ ప్రమాదంలో హయత్ నగర్ డివిజన్ కు చెందిన సాయి కృష్ణ కుడి చెయ్యిని పోగొట్టుకున్నాడు. సాయికృష్ణ(19) న్యాయం చేయాలని, తగిన పరిహారం చెల్లించాలని బాధితుడి బంధువులు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కుడిచేయి తీయాల్సి వచ్చిందని తెలిపారు. డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.