13-08-2025 12:18:02 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యల ను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్ష న్ కేసులను ఈ నెలాఖరు వరకు పరిష్కరించాలని ఆదేశించారు.
స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్లు, శత్రు ఆస్తుల ఆర్థికీకరణ, శరణార్థుల పునరావాసంపై అధికారులు సమ గ్ర నివేదిక అందజేశారు. ఎస్‌ఎస్‌ఎస్‌వై కిం ద పెండింగ్‌లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులు, వారి పై ఆధారపడ్డ జీవిత భాగస్వా ములు/కుమార్తెల పెన్షన్ కేసుల పరిష్కారం లో సాధించిన పురోగతిని వివరించారు. ఎస్‌ఎస్‌ఎస్‌వైకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖవద్ద 26,623 మంది ఫైళ్లు పెండింగులో ఉండగా, ఇప్పటివరకు 13వేలకు పైగా పరిష్కరించినట్లు తెలిపారు.
దాదాపు 12,212 మందికి లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. స్వా తంత్య్ర సమరయోధుల పెన్షన్లకు సంబంధించి 8,829 ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు 6,700 ఫైళ్లను క్లియర్ చేసిన ట్లు వివరించారు. ఇప్పటివరకు 2,103 మం దికి లబ్ధి చేకూరినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 12,800 శత్రు ఆస్తులు
దేశవ్యాప్తంగా 12,800 శత్రు ఆస్తులున్నాయని, వీటిలో 1,427 ప్రాపర్టీస్‌కు సంబం ధించిన వివాదాలను పరిష్కరించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చినట్లు తెలిపారు. 1,300కుపైగా ప్రాపర్టీస్ యూపీకి సంబంధించినవేనని వివరించారు. మరో 616 ఎని మీ ప్రాపర్టీస్‌లో వేలం వేయగా, వాటిలో 31 3 ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తయిందన్నారు. వాటిద్వారా రూ.107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు పేర్కొన్నారు.
3,300కుపైగా కేసులు న్యాయస్థానాల్లో కొ నసాగుతున్నాయని, అందులో 440 ఆస్తుల సర్వే ఇప్పటికే పూర్తయ్యిందని వివరించా రు. వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల కు సూచించారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై పూర్తి వివరాలు అందించాలని కేంద్రమంత్రి ఆదేశించారు. శత్రు ఆస్తులు ఉన్న రాష్ట్రాలకు లేఖలు పంపి, సమావేశాలు నిర్వహించాలన్నారు.