13-08-2025 12:20:20 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మైనింగ్ రంగంలో యువతకు మె రుగైన ఉపాధి కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర, బొగ్గు గనులశాఖ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ (ఎంఎండీడీఆర్) చట్ట సవరణలకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. చట్టంలో మొ త్తం ఆరు సవరణలు చేశామని, సవరణలతో దేశ యువతకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014కు ముందు దే శంలో మైనింగ్ రంగం దారుణమైన స్థితిలో ఉండేదని, ప్రధాని మోదీ సంస్కరణలతో మైనింగ్ రంగం పుంజుకుందని కొనియాడారు. యూపీఏ హయాంలో కేవలం ఒక చిట్టీపై రాసిస్తే, గనుల కేటాయింపు జరిగేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ పారదర్శకతతో వేలం ద్వారా మాత్రమే గనుల కేటాయింపు జరుగుతున్నదని తెలిపా రు. క్రిటికల్ మినరల్స్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని, ఈ నేపథ్యంలో మైనింగ్‌శాఖ వాటి ఉత్పత్తిపై దృష్టి సారించిందని వెల్లడించారు.
దేశ పురోగతిలో మైనింగ్ రంగం పా త్ర కీలకమని, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో క్రిటికల్ మినరల్స్ పాత్ర కీలకంగా ఉంటోందని వివరించారు. దేశంలో వాటి లభ్యత ఉన్నందున భారత్, వాటిని విదేశాల నుంచి దిగు మతి చేసుకుంటోందని తెలిపారు. వీటిని సోలార్ ప్యానెల్స్ నుంచి విండ్ టర్బయిన్స్ వరకు, వ్యవసాయం నుంచి వైద్య పరికరాల వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వరకు, సెల్ ఫోన్ నుంచి విమానాల వరకు, డిఫెన్స్ నుంచి స్పోర్ట్స్ వరకు.. ఇలా అన్ని రంగాల్లో వినియోగిస్తారని వెల్లడించారు.
అందుకే.. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా, ఆ దేశాధినేతలతో క్రిటికల్ మినరల్స్‌పెనేై చర్చిస్తున్నా రని గుర్తుచేశారు. కాబిల్ పీఎస్‌యూ ద్వారా విదేశాల్లోని క్రిటికల్ మినరల్‌ను దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. మైనింగ్ ప్రాంతాల అభ్యున్నతి కో సం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) పెట్టామని, వాటి ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసు కుంటున్నామని వివరించారు.