calender_icon.png 3 November, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాధునిక ఎండోస్కోపిక్‌పై సదస్సు

02-11-2025 12:00:00 AM

యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో లైవ్ వర్క్‌షాప్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ఆధ్వర్యంలో 500 మందికిపైగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాజిస్టులు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వైద్య నిపుణులతో అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై రెండు రోజుల  అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్‌షాప్‌ను శనివారం ప్రారంభించారు.

ఇంటర్వెన్షనల్ ఎండో స్కోపిక్ అల్ట్రాసౌండ్, అధునాతన ఎండోస్కోపి వైద్య రంగంలో ఇటీవల అందుబాటులోకి వచ్చి న పురోగాతులపై యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు-2025 పేరుతో రెండు రోజుల పాటు (నవంబర్ 1, -2 తేదీలలో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ ఈరోజు హోటల్ మరిగోల్ద్ లో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి ప్రారంభించారు.

అన్నవాహిక నుండి దృష్టి సారించి జీర్ణ-ఉదరకోశ, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీఐ క్యాన్సర్ల వరకు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విదానాలు థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ విధానాల ప్రత్యక్ష ప్రదర్శనలు, అడ్వాన్స్ డ్ ఎండోస్కోపీ రంగంలో ఇటీవలి అందుబాటులోకి వచ్చిన పురోగతిపై అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులచే లోతైన చర్చలు,

ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న యువ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు, జీఐ వైద్యులకు వారి ఎండోస్కోపిక్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ కూడా ఈ సదస్సులో అందుబాటులో ఉండడం ఇక్కడి యువ వైద్యులకు ఒక గొప్ప అవకాశమని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి సదస్సును ప్రారంభిస్తూ తెలిపారు. యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్ మాట్లాడుతూ.. “అధ్యయనాల ప్రకారం ప్రతి 10 మంది భారతీయులలో 7 మంది ఏదోఒక గ్యాస్ట్రో ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

ఈ అంతర్జాతీయ సదస్సులో అనేక గ్యాస్ట్రో సమస్యలను ఖచ్చితమైన రోగ నిర్ధారణ పద్దతులు, చికిత్సా విదానాలను ఈ సదస్సుకు హాజరైన యువ డాక్టర్లకు (ప్రత్యక్ష) లైవ్ వర్క్ షాప్ ద్వారా వివరించడం జరిగింది” అన్నారు. యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్ యూనిట్ హెడ్, డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు అనేది జీర్ణశయాంతర ఉదరకోశ చికిత్స నిర్వహణలో అత్యాధునిక క్లినికల్ ఆవిష్కరణ.

ఈ రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన  అధునాతన జీర్ణ-ఉదరకోశ శస్త్రచికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలోని లైవ్ సెషన్లు యువ సర్జన్లకు ఒక గొప్ప వేదిక అని డాక్టర్. విజయ్ కుమార్, తెలియజేసారు.  అంతర్జాతీయ సదస్సులో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు డాక్టర్. రాకేష్ కుమార్ ఆది, డాక్టర్ జి. ఆర్. శ్రీనివాస్ రావు, డాక్టర్ విశ్వనాథ్‌రెడ్డి, యశోద హాస్పిటల్ యూనిట్ హెడ్, డాక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.