02-11-2025 12:00:00 AM
ఖమ్మం జమ్మిబండలో ప్రారంభం
ఖమ్మం, నవంబర్ 1 (విజయక్రాంతి): ఖమ్మంలోని జమ్మిబండలో విజయ డయాగ్నోస్టిక్ వారి అత్యాధునిక డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభమైన ఖమ్మం సెంటర్‌లో అత్యుత్తమ సేవలను అందించడంతో పాటు, సరసమైన ధరల్లో ఖచ్చితమైన డయాగ్నోస్టిక్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతికతతో పాటు అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు.
అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా 3 టెస్లా ఎంఆర్‌ఐ, 160-స్లైస్ సీటీ స్కాన్, బిఎమ్డీ డెక్సా స్కాన్, డిజిటల్ ఎక్స్-రే, డెంటల్ ఓపీజీ, 3డీ/4డీ అల్ట్రాసౌండ్, స్ట్రెస్ టీఎంసీ, ఈసీజీ, 2డీ ఎకో, పీఎఫ్టి, యూరోఫ్లోమెట్రీ మరియు స్పెషాలిటీ ల్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్మన్ డా. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈ అత్యాధు నిక ఇమేజింగ్ సదుపాయాన్ని ప్రారంభించడం, ప్రాంతంలో పెరుగుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
కేర్, ట్రస్ట్, సాంకేతికత అనే మూడు మూల స్తంభాలపై నిర్మితమైనదే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నారు. సుప్రితారెడ్డి, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మాట్లాడు తూ.. “మేము ఎల్లప్పుడూ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను అందించడంలో కట్టుబడి ఉన్నాం.
ఖమ్మం సెంటర్ ద్వారా అత్యాధు నిక పరికరాలు, నిపుణుల బృందం, పూర్తి స్థాయి డయాగ్నోస్టిక్ సేవలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చాం” అన్నారు. కస్టమర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకు, ఈ సెంటర్లో ఆన్లైన్ బుకింగ్, హోమ్ సాంపిల్ కలెక్షన్, త్వరిత రిపోర్ట్ యాక్సెస్ వంటి సేవలు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.