calender_icon.png 1 May, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలు

01-05-2025 05:38:14 PM

కోదాడ: కోదాడలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐఎన్టియుసి) జిల్లా అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో మే డే వేడుకల(May Day celebrations)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు యాతాకుల మధుబాబు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తెస్తున్నటు వంటి వైద్య ఆరోగ్యశాఖ యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలన్నారు.

అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు నిర్దిష్ట వేతనం అందించాలని, ఆరోగ్య భీమా కల్పించాలని, ఆశా కార్యకర్త చనిపోతే ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు, తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ, కౌన్సిలర్లు కత్తిబోయిన శీను, పెండే వెంకటేశ్వర్లు, రాజు, ఆశా కార్యకర్తల నాయకులు కలమ్మ, విజయలక్ష్మి, బి.అరుణకుమారి, సునీత, లక్ష్మి, జి అరుణ, ముత్యాల రాణి, రాధా, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.