calender_icon.png 1 May, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టులో కేసులు సత్వర పరిష్కారానికి కృషి

01-05-2025 05:53:35 PM

తుంగతుర్తి సివిల్ కోర్ట్ జడ్జి ఎండి గౌస్ పాషా...

తుంగతుర్తి (విజయక్రాంతి): కేసులను త్వరితగతంగా పరిష్కారం చేద్దాం, కోర్టుల పట్ల కక్షి దారులకు విశ్వాసం. పెంచుదాం అని తుంగతుర్తి సివిల్ కోర్టు జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు. అనంతరం పదవి బాధ్యతలు చేపట్టిన నూతన జడ్జికి న్యాయవాదులు, పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా  బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. జ్ఞానసుందర్  మాట్లాడుతూ... గత కొంతకాలంగా పూర్తిస్థాయిలో జడ్జి లేకపోవడం వలన ప్రజల సమయం, వారి డబ్బు వృధా అయింది.

న్యాయ వాదులు కూడా కక్షదారులకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తుంగతుర్తిలో కోర్టు బిల్డింగ్ కొరకు ప్రభుత్వం వారు 3 ఎకరాముల ఇరువది గుంటల భూమి కేటాయించినది. కోర్టుభవన నిర్మాణం కొరకు ఎంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు 29 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. నిధుల మంజూరు కొరకు ఆడిసనల్ కోర్టు మంజూరు కొరకు త్వరలోనే ముఖ్య మంత్రిని డిప్యూటీ ముఖ్య మంత్రి కలిసి మంజూరు చేపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రసిడెంట్ కారింగుల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పర్వీన్, జాయింట్ సెక్రటరీ రవి కుమార్, ట్రెజరర్, సతీష్, ఎగ్జీక్యూటివ్ మెంబర్ ప్రతాప్, సీనియర్ న్యాయవాది కుమార స్వామి, హరిచరణ్, చంద్రమౌళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.