01-05-2025 05:35:44 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త సంకినేని కృష్ణారావు...
తుంగతుర్తి (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాలవరపు లక్ష్మి నరసయ్య చేసిన సేవలు మరువలేనిమై ప్రముఖ పారిశ్రామికవేత్త సంకినేని కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులో పాలవరపు లక్ష్మి నరసయ్య 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం వినియోగదారులను మండల జర్నలిస్టులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బంకు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతుకులపాడు గ్రామంలో మొదటి సర్పంచిగా పాలవరపు లక్ష్మీ నరసయ్య రాణించి నకిరేకల్ కేంద్రంలో వాసవి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులను విద్యలో రాణించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.
అనంతరం కుమారులైన పాలవరపు సంఘమిత్ర, ఆజాద్, పోలవరపు సంతోష్ మాట్లాడుతూ... అనునిత్యం పేద ప్రజల కోసం తపించే వ్యక్తి మా నాన్నగారిని అన్నారు. తుంగతుర్తిలో బంకు స్థాపించి 40 సంవత్సరాలు అయి వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించినట్లు గుర్తుచేశారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో రకమైన సేవలు పేద ప్రజలకు అందించాలని కోరారు. వినియోగదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారు దయాకర్ ఈగ లక్ష్మయ్య తాటికొండ సీతయ్య గోపారపు సత్యనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా సిపిఎం ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్ర హరికృష్ణ గుజ్జ భాస్కర్ వివిధ సంఘాల కార్మిక సంఘాల నాయకులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.