calender_icon.png 1 May, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షాన పోరాడేది ఎర్రజెండా ఒక్కటే

01-05-2025 05:33:04 PM

మేడే వేడుకల్లో సిపిఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు..

చర్ల (విజయక్రాంతి): ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమే అంటూ సిపిఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు అన్నారు. మేడేను పురస్కరించుకొని చర్ల మండల కేంద్రంలో గురువారం 139వ మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే జండా ఆవిష్కరణలు నిర్వహించి, సభలు, సమావేశాలు జరిపారు. సిపిఎం మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మేడే ఉత్సవంలో ఆయన మాట్లాడారు.

చికాగో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులపై నేటి పాలకులు తీవ్రంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. కార్మిక, ప్రజా హక్కులపై కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూ, ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం కృషి చేయటమే మేడే అమరవీరులకు మనం ఇచ్చే నివాళులు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల వేసిన పంటలకు గిట్టుబాటు ధరలు చట్టం తీసుకురావాలని, కార్మికులు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పొడుపుకంటి సమ్మక్క, పామర్రు బాలాజీ, బందెల చంటి, హరినాధ వర్మ, షారోని వరలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు.