11-12-2025 07:15:31 PM
జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా వర్దన్నపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఇమ్మడి సుధీర్ కుమార్ ను జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందించారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా జై భీమ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.