calender_icon.png 11 December, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టరేట్ సాధించిన బచ్చు శ్రీకాంత్

11-12-2025 07:51:11 PM

ప్రమాదం నుండి పి.హెచ్.డి వరకు..

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం ఎర్రకుంట గ్రామానికి చెందిన బచ్చు శ్రీకాంత్ డాక్టరేట్ సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ అన్ స్ట్రక్చరల్, మ్యాగ్నెటిక్ అండ్ డైలెక్ట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ వై టైప్ అండ్ డబ్ల్యు టైప్ హెక్సా పే రైట్స్ అనే అంశంపై పరిశోధన చేయగా ఉస్మానియా యూనివర్సిటీ గుర్తించి శ్రీకాంత్ కు డాక్టర్ ప్రధానం చేసింది. డాక్టరేట్ పొందిన బచ్చు శ్రీకాంత్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధనలు కొనసాగించి సంబంధిత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు తెలిపారు. పరిశోధన పరిశీలించిన విశ్వవిద్యాలయం ఇటీవల డాక్టరేట్ ప్రధాన చేసినట్లు ఆయన తెలిపారు.

తాను చేసిన పరిశోధనలకు సహకరించిన శాస్త్రవేత్త డాక్టర్ వి రాఘవేంద్ర రెడ్డి,రిటైర్డ్ ప్రొఫెసర్ పి.యాదగిరి రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు బచ్చు వెంకటేశ్వర్లు భద్రమ్మ సామాన్య కుటుంబానికి చెందినవారు. శ్రీకాంత్ ప్రాథమిక విద్యను గ్రామాల్లోని చదవగా ఇంటర్ కోదాడలోని నలందా కళాశాలలో పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం హైదరాబాదు వెళ్లి అక్కడ నిజాం కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2018లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెల్సీ పీజీ కోర్సును పూర్తి చేశారు.

పీజీ పూర్తి చేసిన అనంతరం సిఎస్ఐఆర్ ఎన్ ఈ టి (జెఆర్ఎఫ్) కు అర్హత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా చేరినట్లు శ్రీకాంత్ తెలిపారు. చిన్నతనంలో రోడ్డు ప్రమాదానికి గురై దాన్నుంచి బయటపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కుటుంబాల్లోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లక్ష్యంతో ముందుకు వెళ్లి పీహెచ్డీ పట్టాను అందుకున్నందుకు శ్రీకాంత్ ను స్నేహితులతో పాటు గ్రామస్తులు అభినందించారు.