calender_icon.png 25 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు త్వరలోనే 2,500 ఇస్తాం

25-01-2026 12:56:57 AM

మంత్రి సీతక్క ప్రకటన

కేసముద్రం, జనవరి 24 (విజయ క్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, త్వరలో మహిళలకు ఇచ్చిన నెలకు రూ.2,500 పంపిణీ పథకాన్ని అ మలు చేస్తామని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన స మావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టిందని, అప్పులు తీర్చుకుంటూ.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. త్వరలోనే మిగిలిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యంలో కృషి చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.