calender_icon.png 11 October, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్

11-10-2025 12:00:00 AM

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విమర్శ

మహబూబాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మళ్లీ మోసం చేస్తోందని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. మోసపూరిత, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చి 22 నెలలు ఆయినా ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశాన్ని, రానున్న ఎలక్షన్లలో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదియాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.