calender_icon.png 11 October, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తారని అగ్రవర్ణాలకు భయం

11-10-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తాం

వరంగల్ ఉద్యమ గడ్డ నుంచి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్

హనుమకొండ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తారని అగ్రవర్ణాలు బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నాయనీ కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ గారు మండిపడ్డారు. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రనాయకులు అడ్డుపడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించామో ఇప్పుడు బీసీలమంతా ఐక్యమై 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామన్నారు.

ఇంకా అగ్రవర్ణాల పాలన వద్దు. ఇకముందు బీసీల పాలన కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుతున్నారన్నారు. అగ్రవర్ణాలు మమల్ని ఇలానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని అడ్డుకోవడానికి ఎంత సమయం పట్టదని బీసీ వ్యతిరేకులకు సుందర్ రాజ్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ ప్రజలను కాదని రాజకీయ పార్టీలు నడుస్తాయా.? అని ప్రశ్నించారు.అన్ని రాజకీయ పార్టీలు బీసీల పక్షాన ఉంటాయా?.బీసీల వ్యతిరేకుల పక్షనా ఉంటారో ఆలోచించుకోవాల్సిన  అవసరం ఉందన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు బీసీ 42% రిజర్వేషన్లను ఆక్సెప్ట్ చేస్తే పెద్ద కష్టమైన విషయమేమి కాదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు కాదన్నారు.బీసీల రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల నేతలు ఒకరినొకరు నిందించుకోవడంతో మిమ్మల్ని అందరిని బీసీ వ్యతిరేకవా దులుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాబోయే రోజులలో వరంగల్ ఉద్యమ గడ్డ నుండి బీసీల ఉద్యమంతో సత్తా చాటుతామని సుందర్ రాజ్ యాదవ్ హెచ్చరించారు.