05-12-2025 10:24:37 PM
మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో ఎన్నుకోవాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలకల మంజుల వెంకన్న గ్రామ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ... కార్యకర్తలు కష్టపడి పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.
గ్రామాల్లో అభ్యర్థులు అందరితో సమన్వయం చేసుకొని గెలుపుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ సకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంజుల వెంకన్న మాట్లాడుతూ... మీ ఇంటి ఆడబిడ్డ గా ఈ గ్రామానికి సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని మీ అమూల్యమైన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.