calender_icon.png 5 December, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబ్రీ మస్జిద్ ధ్వంస దినం (బ్లాక్ డే)’ నేపథ్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు

05-12-2025 10:18:45 PM

శాంతి భద్రత పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకే తనిఖీలు

 గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి

గోదావరిఖని,(విజయక్రాంతి): బాబ్రీ మసీద్ ధ్వంస దినం బ్లాక్ నేపథ్యంలో శాంతి భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనియా సంఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లు ఆధ్వర్యంలో గాంధీ చౌక్, రమేష్ నగర్, తిలక్ నగర్, 5 ఇంక్లైన్, అడ్డంగుంటపల్లి, మార్కండేయ కాలనీ, బస్ స్టాండ్ ప్రాంతంలో ఎస్ఐలు, స్పెషల్ పార్టీ, సిబ్బందితో కలిసి ఆకస్మిక వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించి, ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను పోలీసులు సోదాలు చేసి వివరాలు నమోదు చేశారు.  ప్రధాన జంక్షన్‌లు, కాలనీలు, మసీదులు, ముఖ్య మైన ప్రాంతాలు చుట్టుపక్కల కఠిన నిఘా కొనసాగుతున్నట్లు సీఐ ఇంద్రసేన రెడ్డి  తెలిపారు. ఈ తనిఖీ లలో ఎస్ ఐలు రమేష్, భూమేష్, అనూష, స్పెషల్ పార్టీ సిబ్బంది, బ్లూ క్లోట్స్, పెట్రోకార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.