05-10-2025 06:45:04 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): పూర్వ విద్యార్థుల అపూర్వాంగా రెండు దశబ్దాల తర్వాత తాము చదువుకున్నచోటే కలుసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా హై స్కూల్ లో 2004-05 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపూర్వంగా కలుసుకొని పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. 120 మంది విద్యార్థులకు గాను 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పూర్వ ఉపాధ్యాయులు ఎర్ర సువర్ణ, అబ్దుల్ లతీఫ్, సరోజ లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, కుమార్ లు మాట్లాడారు. నాటి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి పలు ఉద్యోగాల్లో స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సారయ్య వెంకటేష్, కృష్ణ, సుమన, ఆశీస్, కల్పన, సంధ్య, తిరుమల తదితరులు పాల్గొన్నారు.