calender_icon.png 5 October, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల పెన్నిధి "కాకా"

05-10-2025 06:24:11 PM

కాకా జయంతి సందర్భంగా అన్నదానాలు..

కాటారం (విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి, పేదల పెన్నిధిగా పేరుగాంచిన స్వర్గీయ కాకా అలియాస్ గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పలు దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన గడ్డం వెంకటస్వామి సేవలు అమూల్యమైనవని, వారిని నేటికీ ప్రజలు స్మరించుకుంటున్నారని నిర్వాహకులు చిర్ర మహేష్ అన్నారు.

బడుగు బలహీన వర్గాలకు గుడిసెలు(ఇల్లు) ఉండాలని ఆకాంక్షించిన గడ్డం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అని, కాకా అని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిలుచుకునేవారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ లలో కాక జయంతి వేడుకలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డం కుటుంబ అభిమానులు చిర్ర మహేష్, కొలుగూరి తిరుపతి, అయ్యప్ప, చిందం భాస్కర్, గోల్కొండ మల్లయ్య, మహేందర్, శేఖర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.