calender_icon.png 5 October, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజనుల ఐక్యతతో అధిక సీట్లు గెలుద్దాం

05-10-2025 07:05:24 PM

బీఎస్పీ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్..

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో బహుజనులను చైతన్యపరిచి ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేద్దామని జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న 26 జెడ్పిటిసిలను కనీసం మొత్తం సీట్లుగెలిచే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళుతున్నామని ఈరోజు హుస్నాబాద్ పట్టణ బీఎస్పీ పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ మాత్రమే బీసీలకు పూర్తి సహకారంగా పనిచేస్తుంది. మిగతా పార్టీలు బీసీల పట్ల చిత్తశుద్ధితో లేకపోవడం చాలా బాధాకరం.

బీసీల జీవితాలతోని ఈరోజు బీసీ బిల్లు అంటూ రోజుకో మాట మాట్లాడుతూ బీసీలను మభ్యపెడుతున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, బీసీ సామాజిక వర్గం గమనిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదల హక్కుల కొరకు ఒక బీఎస్పీ పార్టీ మాత్రమే పనిచేస్తుందని జిల్లా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వచ్చే ఎన్నికలలో బీఎస్పీ పార్టీని ఆదరించి అధిక సీట్లలో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్  డేగల వెంకటేశ్వర్లు అసెంబ్లీ ఇన్చార్జు లు పచ్చిమట్ల రవీందర్ గౌడ్  బోయిన్ బాబు అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు రాంబాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు.