05-10-2025 06:58:55 PM
పలు గ్రామాల్లో బాకీ కార్డుల పంపిణీ..
వరంగల్ మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి..
రేగొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దె నెక్కి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచిందని భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆమె రేగొండ, చిట్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దేనెక్కాక అభివృద్ధి విస్మరించిందని అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అవినీతిలో రాష్ట్రాన్ని ముందు ఉంచారని అన్నారు.స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని గండ్ర జ్యోతి కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.