05-10-2025 06:31:51 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీ కేంద్రం మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ సమీపంలో కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. మరిపెడ మండలం బావోజీ గూడెం గ్రామానికి చెందిన గిరిజర్ల సుధాకర్ మరిపెడ నుండి బావోజి గూడెం తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు గాయలయ్యాయి. వారిని స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది.