calender_icon.png 5 October, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

05-10-2025 07:08:24 PM

ఏటూరునాగారంలో బాకీ కార్డుల పంపిణీ..

ఏటూరునాగారం (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి గద్దె నెక్కి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాక అభివృద్ధి విస్మరించిందని అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అవినీతిలో రాష్ట్రాన్ని ముందు ఉంచారని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.