calender_icon.png 5 October, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా

05-10-2025 06:56:51 PM

వచ్చిన రిజర్వేషన్లతో వారికి అభ్యర్థులు ఏం లేరు..

నల్గొండ రూరల్: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని బీఆర్ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తిప్పర్తి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకటించిన రిజర్వేషన్ల వల్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని, ఎన్నికలకు వెళ్లేందుకు జంకుతున్నారన్నారు. ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని కోరారు.

గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవని, వారిని నమ్మి పార్టీ చేతుల్లో పెడితే తీరా అసెంబ్లీ ఎన్నిక సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లొడంగి గోవర్ధన్, గోదావరి గూడెం మాజీ ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి, తండు నరసింహ, కందుల లక్ష్మయ్య, రైతు బంధు కమిటీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపర్తి జ్యోతి మహిళా అధ్యక్షురాలు కోట్రస్వరూప, పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు, నాయకుడు శిరస్సు వార సైదులు, కంచర్ల విజయ, కొమ్ముగిరి, తదితరులు పాల్గొన్నారు.