05-10-2025 06:42:11 PM
బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): స్నేహం, ప్రేమ, ఐక్యత పరిమళం వెదజల్లే పండుగే ఓనం అని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 - గాజులరామారం డివిజన్ పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు మలయాలీస్ వెల్ఫేర్ సొసైటీ, జీడిమెట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన 22వ ఓనం సెలబ్రేషన్స్ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం ఎక్కడ నివసిస్తే అక్కడే పుట్టిన ప్రాంతాన్ని మరువకుండా ఇక్కడ ఓనం పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మలయాలీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కె. కె.పొన్నప్పన్, వైస్ ప్రెసిడెంట్ లాలూ కుట్టన్, జనరల్ సెక్రెటరీ పి. కె.రమేష్, జాయింట్ సెక్రెటరీ సునీల్ సూరారం, ట్రెజరర్ ఈఎం.బైజు, అడ్వైజర్ విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీల్ షాపూర్ నగర్, సునీల్ సూరారం, బిజు, సీఎన్. రాజు, శిజు, ప్రదీప్, డానియల్, ప్యాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్, అడ్వకేట్ కమలాకర్, ప్రభాకర్, చిన్నా చౌదరి, తారా సింగ్, మహేష్, నవీన్, శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు.