calender_icon.png 5 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్షవాతంతో మంచానికే పరిమితమైన బాలుడుకి ఆర్ధిక సహాయం

05-10-2025 06:37:56 PM

ఏజెన్సీ నుంచి మహనగరం వరకు సహాయం అందిస్తున్న "ముప్పనపల్లి సహాయ నిధి"సంస్థ

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ నివాసులు కొంతమంది మేథావులు కలిసి "ముప్పనపల్లి సహాయ నిధి" నడుపుతున్నారు. ఇప్పటికి చాలా మందికి సహాయం చేశారు. కష్టం వచ్చిన వారికి మేమున్నాం అంటూ దాతల సహాయంతో వారికి సహాయం చేస్తున్నారు. ఆదివారం రోజు హైదరాబాద్ లోని జీడిమెట్ల కుత్బుల్లాపూర్ కు చెందిన మల్గే శ్రీకాంత్ అనే వ్యక్తి 3 నెలల చిన్న వయస్సులో పోలియో బారిన పడ్డాడు. కాళ్ళు, చేతులు పని చెయ్యక మంచానికి పరిమితం అయ్యాడు. వీరిది నిరుపేద కుటుంబం, సొంత ఇళ్ళు కుడా లేదు, వీరి తల్లి కొన్ని ఇళ్ళలో పనిచేస్తుంది.

ప్రస్తుతం రాజీవ్ గృహ కల్పలో అద్దెక్కుకుంటున్నారు. ఇతనికి వచ్చే వికలాంగుల పెన్షన్ నుండి ఆ కిరాయి చెల్లిస్తూ రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం ఇతని కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. కనీసం బియ్యం కొందాం అన్నా డబ్బులు లేని ఈ కుటుంబానికి "ముప్పనపల్లి సహాయ నిధి" దాతల ద్వారా డబ్బులు సేకరించి ఆదివారం రోజు అతని ఇంటికి వెళ్లి 7 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు వల్లెపు దేవేందర్ పాల్గొన్నారు.