calender_icon.png 5 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివి

05-10-2025 06:27:27 PM

దళితరత్న తుంగపిండి రాజేష్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాక) బడుగు బలహీన కార్మిక వర్గానికి చేసిన సేవలు మరువలేనివని దళిత రత్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ అన్నారు. కాక 96వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా  నిస్వార్ధ సేవలు అందించి నిరుపేద, అణగారిన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చి గని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి కార్మిక పక్షపాతిగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు.