05-10-2025 07:02:47 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో ఇంజనీర్ పోషన్నగా సుపరిచితుడైన జాగటి పోషం పదవి విరమణ పొందడంతో పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఆదివారం పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సన్నిహితులు, పట్టణ ప్రముఖులు, మిత్రులు, వివిధ కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ డబ్ల్యూఎస్ లో ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టి మండలంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ప్రస్తుతం జైపూర్ మండలంలో విధులు నిర్వహించి వివిధ గ్రామాల ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించారన్నారు. ముఖ్యంగా పట్టణంలో అనేక మంది విద్యార్థులు, వివిధ అవసరాల నిమిత్తం గెజిటెడ్ సంతకాల కోసం వచ్చే వారికి సంతకాలు చేయడమే కాక విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇబ్రహీం, ఎం పద్మారావు, బిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈద లింగయ్య లు పాల్గొన్నారు.