02-09-2025 03:25:38 PM
మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు (విజయక్రాంతి): కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సరిపడ యూరియాను అందించలేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Former MLA Kusukuntla Prabhakar Reddy) ఆరోపించారు. మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పదివేల ఎకరాలకు సాగునీరు అందించి, రైతన్న ముఖంలో సంతోషాన్ని నింపిన కేసిఆర్ పై కాళేశ్వరం కమిషన్ విచారణ పేరిట తప్పుడు నోటీసులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంకు త్వరలోనే తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలుచెప్తారని ఆయన అన్నారు.
60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి, త్రాగునీటికి సాగునీరు లేక తెలంగాణ ప్రజలు వలసలకు వెళ్లారని, ఇప్పటికి తెలంగాణ ప్రజలు మర్చిపోలేక ఉన్నారని, రైతుల సమస్యకు పూర్తి పరిష్కారమని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఈ ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. బిజెపి- కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కేసిఆర్ పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని... తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాలేశ్వరాన్ని ఎండబెట్టి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్ర అని ఆయన అన్నారు.
సిబిఐకి కాలేశ్వరం అప్పజప్పడమంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరంపై సిబిఐకి ఇచ్చినఎఏజెన్సీకి ఇచ్చిన భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులు కేసులు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏన్ని పోరాటాలైన త్యాగాలైనా చేస్తామని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, చండూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, కోడి వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పెద్దగోని వెంకన్న, బొడ్డు సతీష్, పగిళ్ల సతీష్, గౌడ్,కురు పాటి సుదర్శన్, ఇర్గి గురునాథం,బిఆర్ఎస్ అన్ని మండలాల అధ్యక్షులు, బిఆర్ఎస్ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.