calender_icon.png 2 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది

02-09-2025 03:26:43 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(MLC Kavitha Suspended) పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ అంశంపై పలు పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కవిత సస్పెన్షన్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పందిస్తూ... మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలిందన్నారు. కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతే, బీఆర్ఎస్ మూడు ముక్కలైందని చమత్కరించారు. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదని ఎంపీ లక్ష్మణ్ తేల్చిచెప్పారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఇన్నాళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎందుకు కాలయాపన చేశారని ప్రశ్నించారు. సీబీఐకి ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని కోరారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితే చెప్పారని గుర్తుచేశారు. హరీశ్ రావు, సంతోష్ అవినీతి అనకొండలు అని కవిత చెప్పారని ఎంపీ లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ఆస్తులను కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం కొల్లగొట్టిందని లక్షణ్ ఆరోపించారు. కేసీఆర్ ను బలి పశువును చేశారని కవిత అంటున్నారని చెప్పారు. హరీశ్ రావు(Harish Rao), సంతోష్ ల అవినీతిలో కేసీఆర్ పాత్ర ఉందనుకోవాలని ఆయన పేర్కొన్నారు.