02-09-2025 03:21:04 PM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): పట్టణంలోని తిప్పపూర్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Whip Aadi Srinivas) ముఖ్య అతిథిగా హాజరై, వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పేదల ఆరాధ్య దైవం. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, రైతు పథకాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి.
ప్రజల కోసం జీవించి ప్రజల కోసమే ప్రాణత్యాగం చేసిన అరుదైన నాయకుడు వైఎస్.. నేటి తరం ఆయన ఆలోచనలను అనుసరించి ముందుకు సాగాలి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, కట్కూరి శ్రీనివాస్, చిలుక రమేష్, పుల్కం రాజు, బింగి మహేష్, తోట రాజుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.