calender_icon.png 15 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు టైర్ల కింద పడి విద్యార్థిని మృతి

14-07-2025 07:12:38 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్(Jagathgirigutta Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల.. ప్రకారం శ్రీజ(16) అనే విద్యార్థిని కూకట్పల్లి ఎస్ఆర్ గాయత్రి కాలేజ్ లో ఇంటర్ చదువుతుంది. సోమవారం ఉదయం కాలేజ్ కి వెళ్దామని ఆల్విన్ కాలనీ కెఎల్ బార్ ముందు బస్సు కోసం ఎదురుచూస్తుంది. రద్దీగా ఉన్న బస్సు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.