14-07-2025 07:34:37 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాతల చేయూత ఎంతో అవసరమని నెల్లికుదురు ఎస్ఐ చిర్రా రమేష్ బాబు(SI Chirra Ramesh Babu) అన్నారు. ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్య ప్రభాకర్ నాయక్ 10 వేల రూపాయల విలువ గల షూ, టై, బెల్ట్ లను స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సొంత ఊరికి తోచిన సహాయం చేయాలని స్వచ్ఛందంగా ప్రభాకర్ ముందుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. దాత ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ప్రైవేటు విద్యాలయాల్లో మాదిరిగా చక్కగా యూనిఫామ్ తో కనిపించాలనే ఉద్దేశంతో సొంత ఖర్చుతో షూ బెల్ట్, టైలను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, హెచ్ఎం చైతన్య, రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు.