14-07-2025 07:32:18 PM
పెన్ పహాడ్: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా పేదలకు అందించే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు మహిళలు యువత పెద్దఎత్తున సీఎం సభకు తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో మాజీ జెడ్పిటిసి పిన్నేని కోటేశ్వరరావు, ఆర్తి కేశవులు, గజ్జల సైదిరెడ్డి, శివ నాయక్, సందీప్ రాథోడ్, పసుపులేటి వెంకన్న మన్సూర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.