calender_icon.png 15 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినారె పురస్కారానికి డాక్టర్ దామెర రాములు ఎంపిక

14-07-2025 06:51:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): మహాకవి సినారె జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం ప్రకటించిన పురస్కారాలకు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు, కవి డాక్టర్ దామెర రాములు ఎంపికయ్యారు. ఈ నెల 27న భువనగిరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మహాకవి సినారె సాహితి పురస్కారానికి ఉమ్మడి జిల్లాల వారీగా కవులు, రచయితలను ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి తనకు స్థానం లభించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కవులు, రచయితలు, కళాకారులు తదితరులు ఆయనను అభినందించారు.