calender_icon.png 19 November, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

19-11-2025 12:02:25 AM

ఎమ్మెల్సీ దండే విఠల్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కౌటల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సోయం సురేష్, మాజీ వార్డ్ మెంబర్లు కడతి శుక్రు, ఫుల్మేర్ ఫకిరా, మాడావి వత్తు, ఆరే సంఘం  అధ్యక్షులు తంగడే ఉద్ధవ్ పటేల్, బడగే ఎడ్డి పటేల్, భలేపల్లి ఉప సర్పంచ్ ఠాకూర్ బండు, వార్డు మెంబర్ నికోడ్ రఘునాథ్ తో పాటు మాతాజీ ట్రస్ట్కు చెందిన 40 మంది సభ్యులు   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్  సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం అని ,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని. ప్రజా ఆశయాల సాధన కోసం కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ప్రాం తీయ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.