calender_icon.png 27 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

27-11-2025 12:56:45 AM

-అందరిని కలుపుకుని పోతాం..

-రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,  డీసీసీ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, నవంబర్ 26 ( విజయక్రాంతి )  :  సముద్రం లాంటి పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ అందరం కలిసి కట్టుగా పని చేసి కాంగ్రెస్ జెండాను స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకుంటామని రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి జిల్లా అధ్యక్షులు శివ సేనా రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని ఒ ప్రవేట్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్, డిసిసి జిల్లా అధ్యక్షులు శివ సేనా రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ లో వర్గ పోరు అనేవి ఉండవని అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ని ఓడించడం జరుగుతుందన్నారు.

వనపర్తి జిల్లా డిసిసి అధ్యక్షుని పదవికి సహకరించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం కు చెందిన ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షల పదవి చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోరట్స్ అథారిటి చైర్మన్ తో పాటు డిసిసి అధ్యక్షుల పదవి శివ సేనా రెడ్డి కి ఇవ్వడం అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధి వేగవంతం గా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, నాయకులు తైలం శంకర్ ప్రసాద్, తిరుపతయ్య, ధనలక్ష్మి, వాల్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.