02-09-2025 03:17:55 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల లేకున్నా కోటీశ్వరులే
మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా మార్చిందని, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకు తిన్నారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samel) అన్నారు. జాజిరెడ్డిగూడెం, మండలంలోని పలు గ్రామాలు లబ్ధిదారులకు మంగళవారం ఇండ్ల పట్టాలను, రేషన్ కార్డు పట్టాలను అధికారులతో కలిసి అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రూ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శనేశ్వరంగా మారిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల కుటుంబంగా మారి రాష్ట్రాన్ని దోచుకుందని ఫైర్ అయ్యారు. జిల్లాలో మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేలు చెప్పులు లేకున్నా నేడు కోటీశ్వరుడు అయ్యారని ఎద్దేవ చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలు అంది..వారి కష్టాలు తీరుతాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ఘనత ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణు మాధవరావు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, సింగిల్ విండో చైర్మన్ కుంట సురేందర్ రెడ్డి, జాజిరెడ్డి గూడెం ఎమ్మార్వో శ్రీకాంత్,ఎంపీడీవో గోపి, జాజిరెడ్డిగూడెం సంవిధాన్ మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి, సామా అభిషేక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైర బోయిన సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారుల తదితరులు పాల్గొన్నారు.