02-09-2025 03:12:28 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గణేష్ నిమజ్జనాలు చేసే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీంను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన రూట్ మ్యాప్ ను పరిశీలించారు.
ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్, ట్రాన్స్కో, రెవెన్యూ, అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూమ్ కు అటాచ్గా పని చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిశీలించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమన్వయంతో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఆర్ అండ్ బిఈఈ మోహన్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ ఇ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.