16 April, 2026 | 9:40 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపక్షం

16-05-2025 12:40 AM

కామారెడ్డి/ఎల్లారెడ్డి, మే 15,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షమేనని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  అన్నారు. గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 3,500 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.