అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో అలరించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమం
27-08-2026 12:00 AM
కొత్తపల్లి, ఆగస్టు 26 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ‘త్రాలాల‘ పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమం అలరించింది. ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగడానికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని, తల్లిదండ్రుల లక్ష్యాలను సైతం చేధించి ఉన్నత స్థానాలలో స్థిరపడాలని కోరారు. విద్యార్థుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






