23-05-2025 01:31:08 AM
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణా అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, మే 22(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సాధించిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణా అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడిందన్నారు.
కెసిఆర్ పాలనలో ధాన్యం కొనుగోలు చేయాలన్న, ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకుల ఖాతాలో జమ కావాలన్న రైతులు ఎదురుచూసేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి ఎదురుచూపులకు తావు లేకుండా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన తక్కువ రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులను జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెల్లుతుందన్నారు.
గత ప్రభుత్వంలో రైతులు రోడ్డుపై ధర్నా చేసే తప్ప ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి ఉండేది అన్నారు. అకాల వర్షానికి తడిసి, మొలకెత్తిన ధాన్యాలను కూడా కొనుగోలు చేస్తుందన్నారు. సన్న రకం ధాన్యం కూడా కొనుగోలు చేసి రూ.500 బోనస్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి రైతుల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కేదారి మధు, పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, స్టేట్ మైనారిటీ సెక్రటరీ హర్షద్, నాజ్జు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.